భోజ్‌పురి స్టార్ నటుడు పవన్ సింగ్ ఇటీవల జరిగిన కార్యక్రమంలో తన సహనటి అంజలి రాఘవ్‌తో వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఈవెంట్‌లో భాగంగా.. పవన్ సింగ్, అంజలి రాఘవ్ కలిసి వేదికపైకి వచ్చారు. అనంతరం అంజలి ప్రేక్షకులతో మాట్లాడుతుండగా.. పవన్ సింగ్ అనుమతి లేకుండా ఆమె నడుముపై చేయి వేసి తడిమాడు. అంతేగాకుండా తన నడుముపై ఎదో ఉందని పదే పదే అనడంతో అంజలి ఒక క్షణం అసౌకర్యానికి గురైంది. అయితే వెంటనే చిరునవ్వుతో అంజలి ఆ పరిస్థితిని కవర్ చేయడానికి ప్రయత్నించింది.
కొంతమంది పవన్ సింగ్ చర్య, ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉందని, బహిరంగ ప్రదేశంలో ఒక మహిళను ఆమె అనుమతి లేకుండా తాకి ఇలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ ఘటనపై పవన్ సింగ్ లేదా అంజలి రాఘవ్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వివాదం ప్రస్తుతం భోజ్‌పురి పరిశ్రమలో అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు.
