సౌత్ ఆఫ్రికా షెడ్యూల్ కన్నా ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఎస్‌ఎస్‌ఎంబీ-29’ కోసం ఓ సెట్ వేశారట. ఓపెన్ ఏరియా సెట్ కావడంతో అది ఒక చెరువు సమీపంలో సీన్స్ చిత్రీకరణ కోసం వేసిన సెట్ అక్కడ షూటింగ్ జరగాల్సి ఉంది. మహేష్ సున్నితత్వం గురించి ఆలోచించి మరీ మేకర్స్ ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకున్నారు. సెట్ వర్క్ పూర్తయ్యాక దానిలో షూటింగ్‌కు ఒకరోజు మహేష్ పాల్గొన్నారట. సెట్‌లో జస్ట్ అరగంట ఉండి ‘నా వల్ల కాదు.. సారీ’ అని చెప్పి షూటింగ్ మధ్యలో వచ్చేశారట. అలా వచ్చేయడానికి కారణం అక్కడ వేడిని తట్టుకోలేక చిరాకుపడి వచ్చేశారని సన్నిహిత వర్గాల నుండి సమాచారం అందింది. దాంతో ఆ షెడ్యూల్ ఆగిపోయింది. రెండు కోట్ల సెట్ వృధా అయిందని తెలిసింది.

- August 29, 2025
0
56
Less than a minute
You can share this post!
editor