లాల్‌బాగ్చా రాజాను దర్శించుకున్న సిద్ధార్థ్, జాన్వీ

లాల్‌బాగ్చా రాజాను దర్శించుకున్న సిద్ధార్థ్, జాన్వీ

తమ రాబోయే సినిమా పరమ్ సుందరి విడుదల సందర్భంగా, నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ ముంబైలోని ప్రసిద్ధ గణపతి మండపం లాల్‌బాగ్చా రాజాను సందర్శించారు. బాలీవుడ్ యువ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా సినిమా ‘పరం సుందరి’. తుషార్ జలోటా దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఆగ‌స్ట్ 29న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండగా.. ఈ సినిమాలో సిద్ధార్థ్ పంజాబీ అబ్బాయిగా, జాన్వీకపూర్ కేరళ యువతిగా నటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండడంతో వ‌రుస ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది చిత్ర‌యూనిట్. ఇందులో భాగంగానే తాజాగా ముంబైలోని ప్రసిద్ధ గణపతి మండపం అయిన లాల్‌బాగ్చా రాజాను ద‌ర్శించుకుంది ఈ జంట‌. గణేశ్ చతుర్థి ఉత్సవాల వేళ లాల్‌బాగ్చా రాజాను సంద‌ర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇక ఈ వేడుక‌ల‌లో జాన్వీ సంప్రదాయబద్ధంగా ఎర్రటి పైఠానీ చీరలో మెరిసిపోగా.. సిద్ధార్థ్ మల్హోత్రా పింక్ రంగు కుర్తాలో అందంగా  నిలిచాడు.

editor

Related Articles