రష్మిక మందన్న హీరోయిన్‌గా రూపొందుతున్న ప్రేమకథాచిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. దీక్షిత్ శెట్టి మేల్ రోల్ చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నిర్మాణం తుది దశలో ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుండి రెండో పాటను ఈ నెల 26 (మంగళవారం) నాడు విడుదల చేయనున్నట్టు ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ‘ఏం జరుగుతోంది..’ అంటూ సాగే ఈ పాటను రాకేందుమౌళి రాయగా, హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరపరిచారు. చిన్మయి పాడారు. ఫీల్‌గుడ్ లవ్‌సాంగ్‌గా ఈ పాట ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

- August 25, 2025
0
67
Less than a minute
You can share this post!
editor