మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన రూ.1 కోటి విరాళం అందజేశారు. ఈ నిధి రాష్ట్ర ప్రజల సంక్షేమం, ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని చిరంజీవి తెలిపారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును చిరంజీవి స్వయంగా సీఎం నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “చిరంజీవి ఎప్పుడూ సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రజల కోసం, సేవా కార్యక్రమాల కోసం ఆయన చేసే కృషి ప్రశంసనీయం,” అన్నారు. మెగా ఫ్యాన్స్ “చిరు రియల్ హీరో” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆరోగ్య సేవలు వంటి అనేక సామాజిక సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇలాంటి విరాళాలు మరికొందరిని కూడా సహాయక చర్యలకు స్ఫూర్తినిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, వైద్య సాయం, నేత్రదానం చేస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు.
- August 25, 2025
0
159
Less than a minute
You can share this post!
editor


