టాలీవుడ్‌కి చిరునామా, భారతీయ సినిమా గర్వకారణం, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన సినీ ప్రయాణంలోని ఓ ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అది మెగాస్టార్ పెళ్లిరోజున… చిరిగిపోయిన చొక్కాతో పెళ్లి చేసుకున్న ఘటన! 1980లో కమెడియన్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్న చిరంజీవి అప్పటికి నటుడిగా తన కెరీర్ ప్రారంభ దశలోనే ఉన్నారు. తల్లిదండ్రుల అంగీకారంతో, నిర్మాత జయకృష్ణ మధ్యవర్తిత్వంతో ఈ వివాహం జరిగింది. అయితే పెళ్లికి ముందు, ‘మనవూరి పాండవులు’ షూటింగ్ సమయంలో చిరంజీవి నటన చూసిన అల్లు రామలింగయ్య ఎంతో ఇంప్రెస్ అయి తన కుమార్తెను చిరంజీవికి ఇవ్వాలని నిశ్చయించుకున్నారట. అయితే పెళ్లికి ముహూర్తం ముందు కూడా చిరంజీవి షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. MS రెడ్డి నిర్మించిన ‘తాతయ్యకు ప్రేమలీలలు’ సినిమాలో ఓ పాట షూటింగ్‌లో పాల్గొన్నారు చిరు. ఆ సమయంలో తన షర్ట్ చిరిగిపోయిందట. మరొకటి మార్చుకునే సమయం లేకపోవడంతో చిరిగిన షర్ట్‌తోనే పెళ్లి పీటలపై కూర్చున్నారు. అయితే ఎవరో ఒకరు ఆయనకు షర్ట్ చిరిగిపోయిందని గుర్తుచేయడంతో చిరు అసహనంగా స్పందిస్తూ.. “ఇప్పుడు షర్ట్ చిరిగిపోయిందని తాళి కట్టనివ్వరా?” అని అనేసారట. ఈ విషయాన్ని చిరునే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

- August 22, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor