కిర‌ణ్ అబ్బ‌వ‌రం – ర‌హ‌స్య ఫ‌స్ట్ యానివ‌ర్స‌రీ..

కిర‌ణ్ అబ్బ‌వ‌రం – ర‌హ‌స్య ఫ‌స్ట్ యానివ‌ర్స‌రీ..

హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇటీవ‌ల ‘క’ సినిమా సక్సెస్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా ద్వారా కొత్తగా కనిపించాడు. సుజిత్ – సందీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో ఉత్తమ సినిమా అవార్డును సొంతం చేసుకుంది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ప్రస్తుతం కిరణ్ ‘K-Ramp’ అనే కొత్త ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే విడుదలైన ‘రిచ్చెస్ట్ చిల్లర్ గయ్’ గ్లింప్స్‌కి మంచి స్పందన లభించింది. వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.
కిర‌ణ్ అబ్బ‌వ‌రం – ర‌హ‌స్య 2024 ఆగస్ట్ 22న కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతరం 2025 మేలో తల్లి తండ్రులయ్యారు. అయితే నేడు ఈ జంట ఫ‌స్ట్ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా కిర‌ణ్ త‌న సోష‌ల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేయ‌గా, అవి వైర‌ల్ అవుతున్నాయి. మ‌రోవైపు ప‌లువురు ప్ర‌ముఖులు, నెటిజ‌న్స్ వారికి శుభాకాంక్షలు తెలియ‌జేస్తున్నారు. ఇక ఇటీవ‌ల కిరణ్ అబ్బవరం – రహస్య గోరఖ్ దంపతులకు పండంటి అబ్బాయి జన్మించ‌గా, తమ కొడుకు నామకరణ మహోత్సవాన్ని కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా నిర్వహించారు. తన కుమారుడికి ‘హను అబ్బవరం’ అనే పేరు పెట్టిన కిరణ్, ఇదే సందర్భంగా తొలిసారి బాబు ఫొటోను పబ్లిక్‌గా షేర్ చేశారు.

editor

Related Articles