విషం పెట్టారని తెలిసి కూడా క్షమించిన చిరంజీవి..

విషం పెట్టారని తెలిసి కూడా క్షమించిన చిరంజీవి..

ఎంతమంది హీరోలు వ‌చ్చినా వ‌న్ అండ్ ఓన్లీ వ‌న్ మెగాస్టార్ ఒక్క‌రే అని అభిమానులు బ‌ల్లగుద్ది చెబుతుంటారు. 69 ఏళ్ల వ‌య‌సులోను కుర్ర హీరోల‌తో పోటీప‌డుతూ సినిమాలు చేస్తున్నారు చిరు. ఈ రోజు ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌న‌కు తెలియ‌ని ఎన్నో విష‌యాలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో ఆసక్తికర విషయమేంటంటే… తనపై ఒక అభిమాని విషప్రయోగం చేయ‌డం. ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవే ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా తెలియ‌జేశాడు. చిరు మాట్లాడుతూ.. “మరణ మృదంగం సినిమా షూటింగ్ సమయంలో ఓ అభిమాని బర్త్‌డే కేక్ తెచ్చి, బలవంతంగా నా నోట్లో పెట్టాడు. నాకు స్పూన్‌తోనే తినడం అలవాటు కావడంతో, అది చేదు అనిపించి వెంటనే ఉమ్మేశాను. తర్వాత సెట్‌లో ఉన్నవారికి చెప్పగానే, అతన్ని పట్టుకున్నారు. విచారణ తర్వాత అసలు విషయం బయటపడింది. ఆ అభిమాని కేక్‌లో విషం కలిపాడు. కేరళ నుండి తీసుకొచ్చిన వశీకరణం పౌడర్‌ను కేక్‌లో కలిపాడట. అందులో విషం ఉన్నట్లు తేలింది. అతను ఒక పిచ్చి అభిమాని. నేనతన్ని పట్టించుకోలేదనే కోపంతో ఇలా చేశాడట. అయినా కూడా నేను అతనిని క్షమించేశాను, అని చెప్పారు. ఈ సంఘటనను చిరు చాలా సింపుల్‌గా చెప్పిన‌ప్ప‌టికీ, ఇది విన్నవాళ్లంతా షాక్‌కు గురయ్యారు.

editor

Related Articles