గురువారం ఉదయం హీరో నాగచైతన్య తన భార్య శ్రీమతి శోభితతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ ప్రముఖులు తరచూ దర్శించుకోవడం తెలిసిన విషయమే. వీరు దర్శనానికి వచ్చిన సమాచారం తెలిసి అక్కడి భక్తులు, ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వేదపండితులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇటీవలే తండేల్ విజయంతో మంచి జోష్ మీద ఉన్న నాగచైతన్య వరుస సినిమాలను చేస్తున్నారు. అయితే సమయం చిక్కినప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, విదేశీ టూర్లకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే శోభితతో కలిసి చైతన్య స్వామి వారి దర్శనానికి రాగా ఆ జంటను చూసి భక్తులు, అభిమానులు ముచ్చట పడుతున్నారు.

- August 21, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor