‘జైలర్ 2’ పై లేటెస్ట్ న్యూస్..

‘జైలర్ 2’ పై లేటెస్ట్ న్యూస్..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘కూలీ’ తన కెరీర్‌లో మరో భారీ గ్రాసర్‌గా కొనసాగుతుండగా  తర్వాత వచ్చే సినిమాతో రజినీ సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సినిమాల్లో టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ సినిమా ‘జైలర్ 2’ కూడా ఒకటి. మరి దీనిపై ఉన్న హైప్ తర్వాత లెవెల్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా తర్వాత షెడ్యూల్‌లో టాలెంటెడ్ నటుడు ఎస్ జె సూర్య జాయిన్ కాబోతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. అయితే ఎస్ జె సూర్య ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లోనే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా నటసింహ బాలకృష్ణ కూడా ఈ సినిమాలో సాలిడ్ క్యామియోలో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాని సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు.

editor

Related Articles