మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు సినిమాలు దాదాపు పూర్తయ్యి రిలీజ్‌కి దగ్గర పడ్డాయి. ఇక ఈ సినిమాల తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా, అలానే తన బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య తీసిన దర్శకుడు బాబీతో కూడా ఓ సినిమా ఉంటుంది అని తెలుస్తోంది. మరి ఈ కలయికపై లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తోంది. ఈసారి మాత్రం చిరు కోసం బాబీ ప్లాన్ మార్చినట్టు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య తరహాలో ఒక ఎంటర్‌టైనర్‌లా కాకుండా ఈసారి తన వయసుకి తగ్గట్టుగా ప్రాపర్ యాక్షన్ అండ్ ఎలివేషన్స్‌తో కూడిన గ్యాంగ్‌స్టర్ సినిమాగా తీయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. ఆల్‌రెడీ డాకు మహారాజ్ సినిమాతో మంచి మార్కులు తాను అందుకున్నాడు. సో తన అభిమాన హీరో కోసం అంతకు మించే బాబీ ప్లాన్ చేస్తాడని చెప్పొచ్చు. ఈ క్రేజీ కలయికపై మరిన్ని డిటైల్స్ రావాల్సి ఉంది.

- August 20, 2025
0
141
Less than a minute
You can share this post!
editor