ప్రస్తుతం కోలీవుడ్ సినిమా నుండి రాబోతున్న అవైటెడ్ సినిమాయే మదరాసి. దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ కలయికలో చేసిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ పట్ల మంచి హైప్ ఉంది. అయితే తన సినిమాకి మొదటి హీరో శివ కార్తికేయన్ కాదని మురుగదాస్ రివీల్ చేశారు. ఈ సినిమాకి మొదటగా బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్‌ని అనుకున్నారట. కొన్నాళ్ల క్రితం ఈ సినిమా ఐడియా షేర్ చేసుకోగా మొదట ఓకే అన్నారు కానీ తర్వాత మాత్రం షారుఖ్ నుండి సరైన రెస్పాన్స్ రాలేదని తెలిపారు. తర్వాత శివ కార్తికేయన్‌ని చూసి తన కోసం స్క్రిప్ట్‌ని మరింత బెటర్‌గా డిజైన్ చేసినట్టు కన్ఫర్మ్ చేశారు. ఇలా షారుఖ్ రిజెక్ట్ చేస్తే అక్కడి నుండి ఈ టాలెంటెడ్ హీరోకి దక్కిందట ఈ సినిమా.

- August 19, 2025
0
52
Less than a minute
Tags:
You can share this post!
editor