సుహాస్ హీరోగా రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘హే భగవాన్!’. శివాని నాగరం హీరోయిన్. గోపి అచ్చర దర్శకుడు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ని విడుదల చేశారు. సస్పెన్స్, కామెడీతో ఈ టీజర్ సాగింది. టీజర్లో సుహాస్ స్టైలిష్ ఎంట్రీ ఆకట్టుకుంటుంది. శివాని నాగరం గ్లామరస్‌గా కనిపించింది. ‘నా కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలకు పనిచేసిన గోపి.. నా సినిమా ద్వారానే దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. షణ్ముఖ ప్రశాంత్ అద్భుతమైన కథ అందించారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది.’ అని సుహాస్ నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా శివానీ నాగరం, నరేష్ వి.కె.లతోపాటు దర్శక, నిర్మాతలు కూడా మాట్లాడారు.

- August 19, 2025
0
23
Less than a minute
Tags:
You can share this post!
editor