చాలా కాలం తర్వాత తెలుగులో నటించనున్న హీరో?

చాలా కాలం తర్వాత తెలుగులో నటించనున్న హీరో?

బాలీవుడ్‌ నటుడు అనిల్‌కపూర్‌ తన కెరీర్‌ ప్రారంభంలో తెలుగులో ‘వంశవృక్షం’ సినిమాలో యాక్ట్ చేశారు. దర్శకుడు బాపు. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో ఆయన నటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. తమిళ హీరో సూర్య హీరోగా, టాలీవుడ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలోనే అనిల్‌కపూర్‌ కీలకమైన పాత్ర పోషిస్తున్నారట. వెంకీ అట్లూరి ఇప్పటివరకూ రాసిన స్క్రిప్టులన్నింటిలో ఈ స్క్రిప్ట్‌ చాలా బాగా వచ్చిందని ఇన్‌సైడ్‌ టాక్‌. మమితాబైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి జి.వి.ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

editor

Related Articles