మంచు విష్ణు టైటిల్ రోల్లో నటించిన పౌరాణిక సినిమా ‘కన్నప్ప’ జూన్ నెలాఖరులో విడుదలై, ప్రేక్షకుల నుండి మంచి స్పందనతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ మూడో తరం నుండి విష్ణు కుమారుడు అవ్రామ్ వెండితెరకి పరిచయం అయ్యాడు. అయితే ఇప్పుడు ఆ బుడతడు తన మొదటి సినిమాతోనే ‘సంతోషం ఫిల్మ్ అవార్డ్’ సొంతం చేసుకోవడం విశేషం. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును అవ్రామ్ అందుకోగా, దీనిపై విష్ణు ఆనందం వ్యక్తం చేస్తూ, అవార్డు కార్యక్రమానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై విష్ణు సోదరుడు మంచు మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. “అభినందనలు అవ్రామ్.. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను మై బాయ్. ఇలాగే ముందుకు సాగు నాన్నా. విష్ణు అన్న, మోహన్ బాబుతో కలిసి ఈ అవార్డు అందుకోవడం చాలా స్పెషల్. ఎంతో ప్రేమతో మెచ్చుకుంటూ మనోజ్ అని ఎక్స్లో (ట్విట్టర్) పోస్ట్ పెట్టడంతో, ఇది కేవలం చిన్నారి గెలుపుపై హర్షం వ్యక్తం చేయడమే కాక, మంచు బ్రదర్స్ మధ్య తిరిగి బంధం ఏర్పడిందన్న దానికి సంకేతంగా నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

- August 18, 2025
0
64
Less than a minute
Tags:
You can share this post!
editor