పాశ్చాత్య దేశాల్లో బిగ్ బ్రదర్‌గా ప్రారంభమైన రియాలిటీ షో, భారత్‌లో బిగ్ బాస్‌గా మారి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనేక భాషల్లో ఈ షోకి దాదాపు పెర్మనెంట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తెలుగు వెర్షన్‌కు కూడా అదే స్థాయిలో ఆదరణ లభించడంతో, సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదలవుతోంది. హోస్ట్‌గా నాగార్జున మరోసారి మాస్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఇప్పటివరకూ సెలబ్రిటీలే హౌస్‌లోకి అడుగుపెట్టేవారు. కానీ గత కొన్ని సీజన్లుగా సామాన్యులకు కూడా అవకాశం ఇస్తూ, టీఆర్పీ రేటింగ్స్‌ను పెంచేందుకు నిర్వహకులు కొత్త స్ట్రాటజీకి తెర తీశారు. ఈసారి ఏకంగా ఐదుగురు సామాన్యులు హౌస్‌లోకి వెళ్లేందుకు ఎంపిక కానుండటంతో ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది. ఈ క్రమంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఆగస్ట్ 22 నుండి ప్రసారం కానున్న ఈ ప్రీ-షోలో 40 మంది సామాన్యులు పాల్గొనబోతున్నారు. ఈ అగ్నిపరీక్షలో టాస్కుల ద్వారా వారు తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరికి 15 మందిని షార్ట్‌లిస్ట్ చేసి, ఆపై మరోసారి స్క్రీనింగ్ చేసి చివరికి 5 మందిని హౌస్‌లోకి పంపించనున్నారు. ఈ కార్యక్రమానికి జడ్జెస్‌గా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు బిందు మాధవి, నవదీప్, అభిజిత్ వ్యవహరిస్తుండగా, యాంకర్‌గా శ్రీముఖి కనిపించనున్నారు.

- August 18, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor