‘అడుగు అడుగునా..’ గీతం రిలీజ్ చేసన సివి ఆనంద్

‘అడుగు అడుగునా..’ గీతం రిలీజ్ చేసన సివి ఆనంద్

రోహిత్‌ సాహిని, గౌతమ్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మిస్టీరియస్‌’. మహీ కోమటిరెడ్డి దర్శకుడు. జయ్‌ వల్లందాస్‌ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. చిత్రబృందం ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ‘అడుగు అడుగునా..’ అంటూ సాగే ఈ సినిమాలోని ఓ సందేశాత్మక గీతాన్ని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఎం.ఎల్‌.రాజా ఈ గీతాన్ని రాసి, స్వరపరచగా, ఎం.ఎల్‌.ఆర్‌. కార్తికేయన్‌ ఆలపించారు. పోలీసుల నిబద్ధతను తెలియజేసేలా ఈ పాట సాగింది.

editor

Related Articles