తెలుగు సినిమా ప్రేక్షకులని మూడు దశాబ్దాలకు పైగా తన నటనతో అలరిస్తూ వస్తున్నారు జగపతిబాబు. వెండితెరపై విలక్షణమైన నటనతో ముద్ర వేసిన ఈ నటుడు ఇప్పుడు బుల్లితెరపై టాక్ షో హోస్ట్‌గా కూడా మారారు. జయమ్ము నిశ్చయమ్మురా అనే కొత్త టాక్ షోకు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తొలి ఎపిసోడ్‌లో కింగ్ నాగార్జున సందడి చేశారు. జగపతిబాబు సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటూ, తన కెరీర్ అప్‌డేట్స్, వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచుకుంటున్నారు. అయితే జగపతి బాబు తాజాగా తన యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆయన అసలు పేరు జగపతిరావు అని… కాకపోతే ఇండస్ట్రీలో రావులు ఎక్కువైపోయారని… అందుకే తన పేరును జగపతిబాబుగా మార్చారని చెప్పుకొచ్చారు. అయితే అందరికీ నోరు తిరగడానికి ఈజీగా ఉంటుందని జగ్గూభాయ్‌గా మారిపోయానని స్పష్టం చేశారు. ఇక ’అంతఃపురం’ సినిమాలో తాను దాదాపు చనిపోయానని అనుకున్నానని జగపతి బాబు చెప్పుకొచ్చారు. డైరెక్టర్ కృష్ణవంశీ సీన్‌లో లీనమై కట్ చెప్పకపోవడంతో… తాను నిజంగానే పోయాననుకున్నానని జగ్గూభాయ్ అన్నారు. అయితే తన కెరీర్ మొత్తంలో ఆ సినిమాలో క్లైమాక్సే తన ఫేవరెట్ షాట్ అంటూ జగపతిబాబు చెప్పడం విశేషం. తనకు పెద్దగా కోరికలు ఏమి లేవని చెప్పిన జగపతి బాబు చివరి శ్వాస వరకు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. ఇందుకోసం ప్రతి రోజూ ప్రాణాయామం చేస్తున్నానని చెప్పారు.

- August 16, 2025
0
61
Less than a minute
Tags:
You can share this post!
editor