బాలీవుడ్ నుండి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లలో ఒకటి ‘రామాయణ’. దాదాపు రూ.4,000 కోట్ల బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమా 45కి పైగా భాషల్లో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్ నటించబోతుండగా.. సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తోంది. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే తదితరులు నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలను షేర్ చేశారు హీరో సన్నీడియోల్. ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోల్ చాలా సరదాగా అల్లరిగా చిలిపిగా ఉండడంతో పాటు ఉత్సాహంగా కూడా ఉంటుందని సన్నీ తెలిపారు. నా పాత్రకు సంబంధించి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇలాంటి పాత్రలు చాలా సవాలుతో కూడుకున్నవని అందులో పూర్తిగా లీనమై పాత్రలో జీవించాలని సన్నీ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని పంచడానికి చిత్రబృందం నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. హాలీవుడ్ సినిమాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

- August 16, 2025
0
63
Less than a minute
Tags:
You can share this post!
editor