పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన “హంగ్రీ చీతా” గ్లింప్స్, మాస్ లిరికల్ సాంగ్‌తో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా ఈ సినిమా రూపొందుతోందని టాక్. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న, అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇవ్వాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న OG నుండి స్టైలిష్ యాక్షన్‌తో కూడిన వీడియో సాంగ్ రిలీజ్ చేయాలని మేకర్స్ సిద్ధమవుతున్నారు. గతేడాది బర్త్‌డే సందర్భంగా వచ్చిన “హంగ్రీ చీతా” గ్లింప్స్ ఎంతగా హైప్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈసారి దానికి మించిన విజువల్స్‌తో, తమన్ కంపోజ్ చేసిన మాస్ మ్యూజిక్‌తో పవన్ బర్త్‌డే స్పెషల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో OG టీమ్ ముందుకు వెళుతోంది.
- August 16, 2025
0
100
Less than a minute
Tags:
You can share this post!
editor

