ప్రభాస్ సినిమా ఏడాది లోపే రిలీజ్‌కి సన్నాహాలు? 

ప్రభాస్ సినిమా ఏడాది లోపే రిలీజ్‌కి సన్నాహాలు? 

షూటింగ్ స్టార్ట్ అయిన  ఏడాదికే ప్రభాస్‌ సినిమా విడుదల కావడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా? అంటే ‘అసాధ్యం’ అనే సమాధానమే వస్తుంది. కానీ దాన్ని సాధ్యం చేసే పనిలో బిజీగా ఉన్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ప్రస్తుతం ది రాజాసాబ్‌, ఫౌజీ షూటింగుల్లో  బిజీగా ఉన్నారు ప్రభాస్‌. వీటిలో ‘ది రాజాసాబ్‌’ షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ఈ ఏడాది లోపు ‘ఫౌజీ’ షూటింగును కూడా ప్రభాస్‌ కంప్లీట్‌ చేయనున్నారు. వచ్చే ఏడాదంతా ఆయన ‘స్పిరిట్‌’ సినిమాకే డేట్స్‌ కేటాయించారని ఇప్పటివరకూ వార్తలొచ్చాయి.

కానీ అందులో ఏ మాత్రం నిజం లేదని సందీప్‌రెడ్డి వంగా టీమ్‌ చెబుతున్నారు. సందీప్‌ వర్కింగ్‌  స్టైల్‌ భిన్నంగా ఉంటుందనీ, ఇప్పటికే ‘స్పిరిట్‌’ ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతోందని, బౌండ్‌ స్క్రిప్ట్‌తో ఆయన లొకేషన్‌లోకి ఎంటరవుతారని, షూటింగ్‌ను కేవలం ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తానని ముందే చెప్పారని చిత్రబృందం పేర్కొంది. మిగతా ఆరు నెలల్లో పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసి, సరిగ్గా షూటింగ్‌ మొదలైన ఏడాదికి ‘స్పిరిట్‌’ని విడుదల చేసేందుకు సందీప్‌ ప్లాన్‌ చేశారట. నిజంగా ఇది డార్లింగ్‌ అభిమానులకు పండుగలాంటి వార్తే.

editor

Related Articles