ఈ వారం బాక్సాఫీస్ దగ్గర రెండు బడా సినిమాలు పోటీపడ్డ విషయం తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో రజనీకాంత్, నాగార్జున నటించిన కూలీతో పాటు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన వార్ 2 సినిమాలు ఆగస్ట్ 14న థియేటర్స్‌లో విడుదల అయ్యాయి. భారీ అంచనాల మధ్య ‘వార్ 2’, ‘కూలీ’ సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో, అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. ఈ సందడిలో కామన్ ఆడియన్స్‌తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా థియేటర్లలో సందడి చేశారు. న్యాచురల్ స్టార్ నాని ఈ రెండు సినిమాలను వీక్షించేందుకు హైదరాబాద్‌లోని ఎఎంబి థియేటర్‌కు వెళ్లారు.
అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. నాని పూర్తిగా మాస్క్‌తో ముఖాన్ని కప్పుకొని అక్కడికి వెళ్లాడు. తనని ఎవరూ గుర్తు పట్టకూడదని ముఖాన్ని పూర్తిగా కవర్ చేసుకున్నాడు. తన కొత్త లుక్‌ను రివీల్ కాకుండా చూసేందుకు ఇలా మాస్క్ ధరించాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రస్తుతం నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.