పెళ్లి  పీట‌లెక్కిన  హీరో  విశ్వంత్..

పెళ్లి  పీట‌లెక్కిన  హీరో  విశ్వంత్..

ఇటీవ‌ల టాలీవుడ్ ప్ర‌ముఖులు ఒక్కొక్కరుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ‘కేరింత’ ఫేమ్ యంగ్ హీరో విశ్వంత్ తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టాడు. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ, ఆయన భావన అనే యువతితో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఈ క్యూట్ క‌పుల్‌కి నెటిజ‌న్స్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. అయితే 2024 అక్టోబ‌ర్‌లో ఈ జంట నిశ్చితార్థం జ‌రుపుకున్న‌ట్టు తెలుస్తోంది. అప్పట్లో భావ‌నతో దిగిన ప‌లు ఫోటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. పలు రకాల క్యాప్షన్లతో ఆనందాన్ని షేర్ చేశాడు. అయితే అప్ప‌ట్లో అత‌ను నిశ్చితార్థం ఫొటోలు పంచుకున్నాడా, లేకుంటే పెళ్లి ఫొటోలు షేర్ చేశాడా అనేది ఎవ‌రికీ అర్ధం కాలేదు. అయితే తాజాగా మాత్రం ఎలాంటి ప్రకటన లేకుండా సింపుల్‌గా మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు ఈ జంట‌.

editor

Related Articles