స‌న్నీ లియోన్ కిచెన్‌లో (బ్యాక్టీరియా) విష పురుగులు..

స‌న్నీ లియోన్ కిచెన్‌లో (బ్యాక్టీరియా) విష పురుగులు..

బాలీవుడ్‌లో ఓ ప్ర‌ముఖ న‌టిగా, డ్యాన్స‌ర్‌గా తనకంటూ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకుంది సన్నీ లియోన్, అసలు పేరు కరణ్ జిత్ కౌర్ కాగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక సన్నీ లియోన్‌గా మార్చుకుంది. భార‌త మూలాలు ఉన్న స‌న్నీ లియోన్.. 2012లో ‘జిస్మ్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. మొదట అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. అనంతరం 2013లో నటించిన ‘జాక్‌పాట్’ కూడా నిరాశపరిచింది. కానీ 2014లో వచ్చిన ‘రాగిణి MMS 2’ హర్రర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం ఆమెకు కొంత గుర్తింపు తీసుకొచ్చినా, నటిగా స్థిరపడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సమయంలో సన్నీ ఐటెం సాంగ్స్ చేయడం ప్రారంభించింది. ఆమె చేసిన కొన్ని పాటలు యువతను బాగా ఆకర్షించాయి. తన 12 ఏళ్ల సినీ కెరీర్‌లో సన్నీ దాదాపు 40 సినిమాల్లో నటించిందైనా, చాలా సినిమాల్లో ఆమె పాత్రలు పరిమితమైనవే. అడల్ట్ సినిమాల్లో తనతో కలిసి నటించిన డేనియల్ వెబర్‌ను సన్నీ 2011లో పెళ్లాడింది. దశాబ్దకాలంగా తమ వైవాహిక జీవితం కొనసాగిస్తున్న ఈ జంటకి ముగ్గురు పిల్లలు నిషా, నోహ్, ఆషెర్ ఉన్నారు. నిషాను ఈ దంపతులు దత్తత తీసుకున్నారు. నటిగా కాకుండా, డ్యాన్సర్‌గా కూడా మంచి డిమాండ్ ఉన్న సన్నీ, ఒక్కో ఐటెం సాంగ్‌కి రూ.3 కోట్లు వరకు తీసుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె దక్షిణాది సినిమాల్లో కూడా కొన్ని ప్రాజెక్టుల్లో నటించింది. తాజాగా త‌న కిచెన్‌లో ట‌మేటా కోస్తున్న‌ప్పుడు అందులో నుండి విష పురుగులు (బ్యాక్టీరియా) బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని తెలిపింది. త‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌ల నేప‌థ్యంలో అలాంటి వాటి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ సూచ‌ల‌ను చేసింది. ప్ర‌స్తుతం స‌న్నీ షేర్ చేసిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

editor

Related Articles