బాలకృష్ణ నటుడిగానే కాదు మంచి మనసున్న మనిషిగా ఎంతోమంది మన్ననలు పొందుతున్నారు. సినిమాలతో అలరిస్తూనే వీలున్నప్పుడు పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. తాజాగా బాలకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, తన అభిమాని బద్రిస్వామి అనారోగ్య పరిస్థితిపై స్పందించారు. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన బద్రిస్వామి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. డాక్టర్లు రూ.20 లక్షలు ఖర్చవుతుందని పేర్కొనగా, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న బద్రిస్వామికి చికిత్స చేయించుకోవడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాదాస్సేన్ బాలయ్య దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన బాలయ్య, రాష్ట్ర ప్రభుత్వ సహాయంగా రూ.10 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు. ఈ సహాయాన్ని బాలకృష్ణ సతీమణి వసుంధర స్వయంగా బద్రిస్వామికి అందజేశారు. బాలయ్య చేసిన సాయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

- July 26, 2025
0
38
Less than a minute
Tags:
You can share this post!
editor