పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ సినిమాయే ‘హరిహర వీరమల్లు’. రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా మొదటి భాగం చివరి నిమిషంలో భారీ హైప్‌ని అందుకొని నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఆ అంచనాలు రీచ్ అయ్యిందా లేదా అనేది చూద్దాం రండి. అది 1650 కొల్లూరు ప్రాంతం అప్పటికే మొగులుల ఆధిపత్యంలో భారతీయులు నలుగుతున్న సమయం అక్కడ దొరికిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సమస్త భారతదేశాన్ని తన మతంలోకి మారితే తప్ప బ్రతుకు లేదంటే చావు అనే అత్యంత క్రూరుడు ఔరంగజేబు వశం చేసుకుంటాడు. అయితే దీనిని తీసుకురాగిలిగే సత్తా ఒక తెలివైన వజ్రాల చోరుడు హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్) సొంతం అని గోల్కొండని పాలిస్తున్న కుతుబ్ షా (దలీప్ తహిల్) వీరుని తన దగ్గరకి రప్పించుకొని అత్యంత కష్టతరమైన కార్యాన్ని అప్పజెపుతాడు. మరి ఇక్కడ నుండి వీరమల్లు ఎలా సవాళ్ళని ఎదుర్కొన్నాడు? అసలు ఈ వీరమల్లు ఎవరు? అతని గతం ఏంటి? వీరమల్లు నిజంగానే కోహినూర్ కోసం వచ్చాడా లేక ఔరంగజేబుతో మరో బలమైన కారణం ఉందా? అదేంటో తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే. ఇక ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే “హరిహర వీరమల్లు” సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం పోరాడే పవర్ స్టార్ తాండవం అని చెప్పవచ్చు. పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లడమే కాకుండా తనపై మంచి ఎమోషన్‌తో కలిగిన సాలిడ్ హై మూమెంట్స్, ఎలివేషన్లు అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లు వెన్నుముకగా నిలిచాయి. సెకాండఫ్‌లో కొన్ని చోట్ల సో సో మూమెంట్స్, డిజప్పాయింట్ చేసే విఎఫ్ఎక్స్‌లు పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. సో వీటితో ప్రేక్షకులను వీరమల్లు ఆకట్టుకుందనే చెప్పాలి.

- July 24, 2025
0
117
Less than a minute
Tags:
You can share this post!
editor