సింగర్ చిన్మయి శ్రీపాద తప్పుడు వ్యాఖ్యలు చేసే వారికి గట్టిగా కౌంటర్‌లు ఇచ్చి పడేస్తుంటుంది. తనని విమర్శించిన లేదంటే సమాజంలో జరిగే సంఘటలను గురించి తప్పుగా మాట్లాడిన సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందిస్తుంది. తాజాగా బీఫ్ తినే నటుడు రణ్‌బీర్ కపూర్ రాముడి పాత్ర పోషించడాన్ని విమర్శిస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు చిన్మయి రిప్లై ఇచ్చిన తీరు చర్చనీయాంశమైంది. ఓ యూజర్ “బీఫ్ తినే రణ్‌బీర్ రాముడి పాత్ర పోషించడమేంటి? మన ఖర్మ!” అని ట్వీట్ చేయగా, చిన్మయి స్పందిస్తూ..“దేవుడి పేరుతో ఓ బాబాజీ రేప్ చేస్తాడు… జైల్లో నుండి బయటకు వచ్చి ఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవొచ్చు.. ఇదే భక్త్ ఇండియా.. అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే.. అదేం పెద్ద సమస్య కాదుగా అని చిన్మయి రాసుకొచ్చింది. చిన్మయి వ్యాఖ్యల పట్ల నెటిజన్స్ రెండుగా విడిపోయారు.. కొంతమంది ఆమెకు మద్దతు తెలుపగా, మరికొంతమంది విమర్శల దాడికి దిగారు. ఒక చెడ్డ పని (బీఫ్ తినడం) ని ఇంకొక చెడ్డ పనితో (రేపిస్టులు రాజ్యమేలడం) ఎలా కంపేర్ చేస్తారు? అని ప్రశ్నించగా, దానికి స్పందించిన చిన్మయి.. ఒక రేపిస్ట్ ఎంపీ గెలిస్తే మీకు ఏమీ అనిపించదు. కానీ బీఫ్ తినే వ్యక్తి రాముడి పాత్ర పోషిస్తే మాత్రం గుండెల్లో మంట. ఈ విషయంలో మీకు ఏం అనిపించడం లేదా? అని కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ వివాదానికి నేపథ్యం అయిన నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ‘రామాయణ’ సినిమా గ్లింప్స్ ఇప్పటికే భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. హన్స్ జిమ్మర్, ఎఆర్ రెహమాన్ బీజీఎంలు, విజువల్స్ అన్నీ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. వచ్చే దీపావళి (2025)కి సినిమా విడుదల చేయాలని టీమ్ తొందరగా షూటింగ్ చేసుకుంటూ పోతోంది.

- July 5, 2025
0
50
Less than a minute
Tags:
You can share this post!
editor