మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సినిమా విశ్వంభర గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం రీసెంట్ గానే ఓ ఇంట్రెస్టింగ్ బజ్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తున్నట్టు టాక్ బయటకు వచ్చింది. అయితే ఈ సాంగ్ ఒక రీమిక్స్ అన్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. అది కూడా చిరంజీవి నటించిన సినిమా సాంగే రీమిక్స్ చేస్తున్నారట. మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్ అన్నయ్య సినిమాలో ఆట కావాలా పాట కావాలా రీమిక్స్ ఇది అన్నట్టు రూమర్స్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమా రిలీజ్ దాకా వేచి ఉండాలి.
- July 4, 2025
0
88
Less than a minute
Tags:
You can share this post!
editor

