టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఇప్పుడు ఆయన నితిన్ హీరోగా రూపొందిన తమ్ముడు మూవీపై అంచనాలు పెట్టుకున్నారు. తమ్ముడు సినిమా నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో రూపొందగా, ఈ సినిమా జులై 4న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దిల్‌రాజు -నితిన్ మధ్య ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ జరగగా, ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఈ ఇంటర్వ్యూలో నితిన్, ఇతర హీరోలతో ఉన్న అనుబంధాల గురించి దిల్‌రాజును ప్రశ్నించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించి ప్రస్తావన రాగా, దిల్‌రాజు సంతోషంగా స్పందిస్తూ.. తారక్‌ని నేను ‘నాన్న’ అని పిలుస్తాను. మా బంధం అంత స్నేహపూర్వకంగా ఉంటుంది. ‘బృందావనం’ సినిమా సమయంలో కొడాలి నాని ఎన్టీఆర్‌ను ‘నాన్న’ అని పిలిచేవాడు. అది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అప్పటి నుండే నేనూ తారక్‌ను ‘నాన్న’ అని పిలవడం మొదలుపెట్టాను. తారక్ కూడా ‘అన్న’ అని పిలుస్తాడు” అని చెప్పుకొచ్చారు దిల్‌రాజు. ఇంతకుముందు ఎన్టీఆర్.. దిల్ రాజు బ్యానర్‌లో “బృందావనం” (2010), “రామయ్య వస్తావయ్యా” (2013) వంటి చిత్రాల్లో నటించి విజయాలు అందుకున్నారు.
- July 1, 2025
0
79
Less than a minute
Tags:
You can share this post!
editor

