దీపావళికి  ‘K-ర్యాంప్‌’..

దీపావళికి  ‘K-ర్యాంప్‌’..

కిరణ్‌ అబ్బవరం హీరోగా రూపొందుతున్న కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘K-ర్యాంప్‌’. యుక్తి తరేజా హీరోయిన్‌గా. జైన్స్‌ నాని దర్శకుడు. రాజేష్‌ దండా, శివ బొమ్మకు నిర్మాతలు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. లుంగీ కట్టుకొని చిందేస్తున్న కిరణ్‌ అబ్బవరంని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. బ్యాగ్రౌండ్‌లో మందు బాటిల్స్‌లో డిజైన్‌ చేసిన లవ్‌సింబల్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లో మరో ఫ్రెష్‌ అటెంప్ట్‌ ఈ సినిమా అని మేకర్స్‌ చెబుతున్నారు. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ సినిమాకి కెమెరా: సతీష్‌రెడ్డి మాసం, సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌.

editor

Related Articles