సినిమా ఇండస్ట్రీలో పెద్ద నటుడవాలని కలలు కంటూ ముంబై, చెన్నైల వంటి నగరాలకు వెళ్లేవారు ఎందరో ఉన్నారు. అయితే అందరికీ అవకాశాలు తలుపుతట్టవు. కొన్ని సందర్భాల్లో కొన్ని పాత్రలు వారిని వెలుగులోకి తీసుకువచ్చినా, అలా వచ్చిన అవకాశాలు వారి జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకురావు. 2013లో అజిత్ హీరోగా, విష్ణువర్థన్ దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమా ‘ఆరంభం’ లో టెర్రరిస్ట్ గ్యాంగ్‌లో ఒకరిగా నటించిన సవి, తన నటనతో ఆకట్టుకున్నా, ఆ తర్వాత పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయాడు. లక్నోకు చెందిన సవి సింధు, లా చదివినా, సినిమాల పట్ల ఉన్న ప్యాషన్ కారణంగా నటన దారిపట్టారు. బాలీవుడ్‌లో కూడా చిన్నా చితకా పాత్రలు పోషించారు. అయితే అవేమీ ఆయన కెరీర్‌కి ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. సినిమా అవకాశాలు రాక, కుటుంబం నుండి కూడా దూరమైన సవి సింధు, ప్రస్తుతం రోజుకు 12 గంటల పాటు వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. రోజువారీ అవసరాలు తీర్చుకోవడమే సవాలుగా మారిందని, థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలన్న చిన్న కోరికను కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో చాలామంది స్టార్‌లు బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే ఎదిగారు. చిరంజీవి, రజినీకాంత్, నాని, శివకార్తికేయన్, అజిత్ లాంటి వారు వారి ప్రతిభతో సత్తా చాటారు. సవి సింధు నటుడు కూడా ఒకప్పుడు సినిమాల్లో నటించారు, కానీ ఇప్పుడు కేవలం బతకడానికే పోరాటం చేస్తున్నాను” అని అంటున్న సవి, బాలీవుడ్ సెలబ్రిటీల నుండి సహాయం అందుతుందేమో అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు కాకపోయిన ఎవరైన సరే మానవత్వంతో ఆయనకి ఎంతో కొంత దాతలు సాయం చేయకపోతారా అని ఎదురుచూస్తున్నారు.
- June 30, 2025
0
53
Less than a minute
Tags:
You can share this post!
editor

