జాన్వీకపూర్ మండిపాటు.. ఆమె మరణం తీరని లోటు..

జాన్వీకపూర్ మండిపాటు.. ఆమె మరణం తీరని లోటు..

హిందీతో సహా తెలుగు సినిమాలలో కూడా మంచి ఫేమ్ ఉన్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్‌లో దేవర, ఇప్పుడు పెద్ది హీరోయిన్ జాన్వీ కపూర్ ఒకరు. మరి జాన్వీ కపూర్ తాజాగా ఓ విషాద ఘటన విషయంలో మండిపాటు వ్యక్తం చేసింది. అయితే బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా అకాల మరణం తర్వాత ఆమెకి జరిగే అంతిమ కార్యక్రమాల విషయంలో కొందరు మీడియా వ్యక్తులు కనబరిచిన అత్యుత్సాహానికి ప్రముఖ హీరో వరుణ్ ధావన్ తన ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసి కనీసం ఇలాంటి విషయాల్లో అయినా మీడియా వ్యక్తులు కవర్ చేసిన విధానం అంత బాగాలేదని వరుణ్ చివాట్లు పెట్టాడు. అయితే తన స్టేట్‌మెంట్‌కి జాన్వీకపూర్ తన సమ్మతి తెలిపింది. చివరికి కనీసం ఒకరైన నోరు విప్పారు అంటూ ఈ సున్నిత అంశం పట్ల వరుణ్ స్టేట్‌మెంట్‌కి తన మద్దతు తెలిపింది. దీనితో జాన్వీ కపూర్ స్టోరీ కూడా వైరల్‌గా మారింది.

editor

Related Articles