హీరోయిన్ ఇలియానా ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితం అయింది. ఒకప్పుడు టాలీవుడ్ కుర్రకారుని హీటెక్కించిన గోవా బ్యూటీ ఇలియానా, తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె రెండోసారి తల్లి అయింది. ఈ నెల 19న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇలియానా తన చిన్నారి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, “మా కుటుంబంలోకి మా రెండో అబ్బాయి కియాను రాఫె డోలన్‌కు స్వాగతం. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి,” అంటూ తన ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పలువురు సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 2023 మే నెలలో, ఇలియానా తన ప్రియుడు మైఖేల్ డోలన్‌ని పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో ఈ దంపతులకు మొదటి కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్ జన్మించాడు. ఇప్పుడు రెండో బిడ్డతో వారి కుటుంబం మరింత పెద్దదైంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మొదటి గర్భధారణ సమయంలో బేబీ బంప్ ఫొటోలను తరచూ పంచుకున్న ఇలియానా, రెండోసారి మాత్రం తన గర్భాన్ని గోప్యంగా ఉంచింది. కేవలం మే నెలలోనే “బంప్ బడ్డీస్” అనే క్యాప్షన్‌తో ఒక ఫొటోను మాత్రమే షేర్ చేసి, గర్భవతినని సంకేతం ఇచ్చింది. ఆ తర్వాత నేరుగా పుట్టిన బిడ్డ ఫొటోని ఫ్యాన్స్ ముందు ఉంచింది.
- June 28, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor

