బ్రాడ్ పిట్ ఇంట్లో చోరీ జరిగింది. లాస్ ఏంజిల్స్‌లో ఉన్న ఆ ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఖరీదైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. బ్రాడ్ పిట్ నటించిన ఎఫ్1 సినిమా ఇవాళ రిలీజ్ అవుతోంది. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ ఖరీదు చేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. లాస్ ఏంజిల్స్‌లోని లాస్ ఫెలిజా ప్రాంతంలో ఆ ఇల్లు ఉంది. 2023లో ఆ ఇంటిని బ్రాడ్ పిట్ కొన్నట్లు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ తెలిపింది. అయితే బ్రాడ్ పిట్ ప్రస్తుతం తన కొత్త సినిమా ఎఫ్1 ప్రీమియర్ టూర్‌లో ఉన్నారు. లండన్‌లో ఆ ఫిల్మ్ ప్రీమియర్ సందర్భంగా ఆయన అక్కడకు వెళ్లారు. మరో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్, ఫార్ములా వన్ డ్రైవర్ లివిస్ హామిల్టన్ కూడా ఆ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. చోరీ జరిగిన సమయంలో బ్రాడ్ పిట్ ఇంట్లో ఉన్నాడా లేదా, లేక చోరీకి గురైన వస్తువుల విలువ ఎంత అన్న విషయాన్ని లాస్ ఏంజిల్స్ పోలీసులు వెల్లడించలేదు.
- June 27, 2025
0
69
Less than a minute
Tags:
You can share this post!
editor

