50 రోజుల్లో వార్ 2.. కొత్త పోస్ట‌ర్ రిలీజ్

50 రోజుల్లో వార్ 2.. కొత్త పోస్ట‌ర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రం ‘వార్ 2’. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2019లో హృతిక్ నటించిన బ్లాక్‌బస్టర్ స్పై థ్రిల్లర్ ‘వార్’కు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ఈ సినిమాలో హృతిక్ మరోసారి రా ఏజెంట్ మేజర్ కబీర్ ధాలివాల్ పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది చిత్ర‌యూనిట్. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు ఇంకా 50 రోజులు ఉంద‌ని తెలుపుతూ.. కౌంట్‌డౌన్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. తాజాగా ఈ పోస్ట‌ర్‌ను ఎక్స్ వేదిక‌గా షేర్ చేశాడు హీరో ఎన్టీఆర్.

editor

Related Articles