ఫ్యాన్స్‌కు బంప‌రాఫ‌ర్.. టైటిల్ ఏంటో చెబితే మిమ్మ‌ల్ని క‌లుస్తా..!

ఫ్యాన్స్‌కు బంప‌రాఫ‌ర్.. టైటిల్ ఏంటో చెబితే మిమ్మ‌ల్ని క‌లుస్తా..!

టాలీవుడ్ హీరోయిన్ ర‌ష్మిక మందన్నా త‌మ ఫ్యాన్స్‌కు బంపరాఫ‌ర్ ఇచ్చింది. తన కొత్త సినిమా టైటిల్‌ను సరిగ్గా చెబితే తానే అభిమానులను స్వయంగా కలుస్తానని రష్మిక మందన్నా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేస్తూ ఈ విష‌యాన్ని షేర్ చేసింది ఈ హీరోయిన్. ఈ పోస్ట‌ర్ చూస్తే.. ర‌ష్మిక ఇందులో వారియ‌ర్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. పిరీయాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. అన్‌ఫార్ములా బ్యాన‌ర్‌పై ఈ సినిమా రాబోతోంది. ఇటీవ‌ల కుబేరా సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది రష్మిక. ఛావాతో ఇప్ప‌టికే ఈ ఏడాది సూప‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న రష్మిక కుబేరతో మ‌రో హిట్‌ను అందుకుంది.

editor

Related Articles