ఒకప్పుడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించని సీక్వెల్స్ ట్రెండ్, ఇప్పుడు టాలీవుడ్‌కి పాకింది. ఒక్క హిట్ సినిమా వస్తే చాలు, వెంటనే దానికి సీక్వెల్ అనౌన్స్ చేస్తూ దర్శక నిర్మాతలు ముందుకెళ్తున్నారు. కొన్ని సినిమాలు మొదటి భాగానికి అసలు సంబంధం లేకుండా తీస్తున్నప్పటికీ, మరికొన్ని మాత్రం స్పష్టంగా కథను రెండు భాగాలుగా చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ ట్రెండ్‌కు బాట వేసిన వ్యక్తి ఎవరు అంటే ఎస్.ఎస్.రాజమౌళి. ఆయన తీసిన బాహుబలి రెండు భాగాల సక్సెస్ చూసి ఇండస్ట్రీ మొత్తం ఈ తరహాలో ఆలోచించటం మొదలెట్టింది. బాహుబలి తర్వాత వరుసగా టాలీవుడ్‌లో పది కంటే ఎక్కువ సీక్వెల్ సినిమాలు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ‘పుష్ప 1’ సినిమా చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవగానే, వెంటనే ‘పుష్ప 2’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ సినిమా సూపర్ హిట్ అయింది. రెండు భాగాలూ భారీ అంచనాల మధ్య తెరకెక్కి మంచి విజయం సాధించడంతో ఇప్పుడు మూడోభాగం కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర 1 సినిమా చేయగా, ఇది సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ‘దేవర 2’ పనులు మొదలు పెట్టారు. దేవర 2లోనే అసలు కథ ఉందని దర్శకుడు కొరటాల శివ చెబుతున్నారు. ఇక సీక్వెల్ ట్రెండ్‌ను బాహుబలి ద్వారా ప్రారంభించిన ప్రభాస్, ఇప్పుడు సలార్, కల్కి 2898 A.D. వంటి సినిమాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఆయన ఖాతాలో ఇప్పటికే ఎక్కువ సీక్వెల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేయబడింది. మొదటి భాగం జులైలో విడుదల కానుండగా, రెండో భాగంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే టాలీవుడ్‌లో ఇప్పటివరకు సీక్వెల్స్‌కు దూరంగా ఉన్నవారు మహేష్‌బాబు, రామ్‌చరణ్ మాత్రమే. మరి మహేష్, చరణ్ ఎప్పుడు ఈ లైన్‌లోకి వస్తారో చూడాలి!

- June 26, 2025
0
46
Less than a minute
Tags:
You can share this post!
editor