థ‌మ‌న్‌కి కాలింది.. అడ్ర‌స్ పంపు ‘బే’ అంటూ…

థ‌మ‌న్‌కి కాలింది.. అడ్ర‌స్ పంపు ‘బే’ అంటూ…

ఇప్పుడు బాల‌య్య న‌టిస్తున్న అఖండ 2 కి కూడా థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కావ‌డం విశేషం. టాలీవుడ్‌లో బిజీయేస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్ లైఫ్ లీడ్ చేస్తుండ‌గా, ఆయ‌న చేస్తున్న ప్ర‌తి సినిమా కూడా మంచి సక్సెస్ అవుతోంది. అయితే థ‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌నిచేస్తూనే సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్, ఇతర సినిమాల్లో క్యామియో అపియరెన్స్ ఇస్తూ త‌న ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తూ ఉన్నారు. థ‌మన్ ఎంత బిజీగా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అప్పుడప్పుడు త‌న సినిమాల‌కి సంబంధించిన విష‌యాలే కాక పర్స‌న‌ల్ అప్‌డేట్స్ కూడా షేర్ చేస్తుంటాడు. రీసెంట్‌గా సీసీఎల్ లీగ్‌లో తెలుగు వారియర్స్ టీమ్ త‌ర‌పున అద్భుతంగా ఆడాడు థ‌మ‌న్. ఇక దీనికి సంబంధించి ఓ క్రికెట్ వీడియోను షేర్ చేస్తూ డోంట్ బౌల్ షార్ట్ బాల్ బ్రో అంటూ పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోకు ఓ నెటిజన్ రిప్లై ఇస్తూ తమన్‌ను ఉద్దేశించి కాస్త సెటైరిక‌ల్ ట్వీట్ చేశాడు. షార్ట్‌కు.. స్లాట్‌కు తేడా తెలియనప్పుడే నాకు అర్థమైంది.. నువ్వు ధోని ఫ్యాన్‌వి అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇది చూసిన తమన్.. ఎప్పటిలాగే తన స్టైల్లో కౌంటరిచ్చాడు. “ఒకే రా.. వచ్చి నేర్చుకుంటా అడ్రస్ పంపు బే” అంటూ రిప్లై ఇచ్చారు తమన్. ఇప్పుడు ఇది కాస్తా నెట్టింట తెగ వైరల్ కావడంతో నెటిజన్స్ కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ ఎందుకు పట్టించుకుంటావ్ అన్నా.. వాళ్లను వదిలేయ్ అన్నా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

editor

Related Articles