పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా “ఓజి” గురించి అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకోగా హీరో పవన్ కళ్యాణ్ భాగం కూడా కంప్లీట్ అయినట్టు మేకర్స్ చెప్పారు. ఇక ఈ సినిమా విలన్ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఆ మధ్య కరోనా వచ్చిన కారణంగా షూటింగ్‌కి దూరం అయినట్టుగా వార్తలొచ్చాయి. అయితే అసలు దీనిపై క్లారిటీ వచ్చింది. నిజానికి ఇమ్రాన్‌కి వచ్చింది కరోనా కాదట. తనకి డెంగ్యూ రావడం మూలానే షూటింగ్‌కి దూరం అయినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం తాను మొత్తం రికవర్ అయి ఫైనల్‌గా షూటింగ్ కోసం సిద్ధం అయ్యారట. ఇలా ప్రస్తుతం ఓజి సెట్స్‌లోనే తాను జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది.
- June 25, 2025
0
136
Less than a minute
Tags:
You can share this post!
editor


