‘కన్నప్ప’ భారీ రిలీజ్.. 5 వేల స్క్రీన్స్‌ కన్నా ఎక్కువే!

‘కన్నప్ప’ భారీ రిలీజ్.. 5 వేల స్క్రీన్స్‌ కన్నా ఎక్కువే!

మంచు విష్ణు హీరోగా ప్రముఖ దర్శకుడు ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా సినిమాయే “కన్నప్ప”. పాన్ ఇండియా లెవెల్లో అనేకమంది స్టార్ హీరోలు కలయికలో తెరకెక్కించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. మరి కన్నప్ప రిలీజ్‌పై ఇప్పుడు సాలిడ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కన్నప్ప మంచు విష్ణు కెరీర్‌లోనే భారీ రిలీజ్‌కి రాబోతుందట. ఈ సినిమా ఏకంగా 5,400 కి పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో 4 వేలు స్క్రీన్స్ ఒక్క ఇండియాలోనే రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇందులోనే ఐమ్యాక్స్ వెర్షన్ ఇంకా 4డిఎక్స్ వెర్షన్ లలో ఈ సినిమా విడుదల చేస్తున్నారట. ఇక ఈ సినిమాకి స్టీఫెన్ డేవెస్సీ సంగీతం అందించగా మోహన్‌బాబు నిర్మాణం వహించారు. అలాగే ఈ జూన్ 27 న గ్రాండ్‌గా రిలీజ్‌కి సిద్ధమైంది.

editor

Related Articles