‘పరమపద సోపానం’లో హీరోగా?

‘పరమపద సోపానం’లో హీరోగా?

‘బిగ్‌బాస్‌’ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడైన అర్జున్‌ అంబటి హీరోగా నటిస్తున్న సినిమా ‘పరమపద సోపానం’. నాగశివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎస్‌ఎస్‌ మీడియా పతాకంపై గుడిమిట్ట శివప్రసాద్‌ నిర్మించారు. జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్. జులై 11న విడుదల కానుంది. సోమవారం టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగశివ మాట్లాడుతూ.. వినూత్నమైన కథాంశంతో ఈ సినిమాని రూపొందించామని, ఆద్యంతం అనేక మలుపులతో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు  హైలెట్‌గా నిలుస్తాయని హీరో అర్జున్‌ అంబటి తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించే సినిమా ఇదని నిర్మాత శివప్రసాద్‌ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: డేవ్‌జాండ్‌.

editor

Related Articles