జొమాటో బాయ్‌గా అల్లు అర్జున్.. జ్యూస్ అమ్ముతున్న రామ్ చ‌ర‌ణ్‌

జొమాటో బాయ్‌గా అల్లు అర్జున్.. జ్యూస్ అమ్ముతున్న రామ్ చ‌ర‌ణ్‌

ఇటీవ‌ల మొత్తం 15 మంది ఏఐ క్యారెక్టర్లతో ఒక పూర్తి సినిమా విడుదలైంది. “లవ్ యూ” పేరుతో కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా ప్రపంచంలోనే తొలి ఏఐ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఏఐ సాంకేతికతతో అద్భుతం సృష్టించవచ్చని వారు నిరూపించారు. ఆ సినిమా కోసం లేని నటులను సృష్టించడమే కాకుండా, ఒక అద్భుత మాయాలోకాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వ‌చ్చింది ఏఐ. దీంతో ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఎక్కువ‌గా ఏఐ వినియోగానికే ఆస‌క్తి చూపుతున్నారు. నాగ‌చైత‌న్య 24వ సినిమా లుక్ డిజైన్ విష‌యంలో ఏఐ స‌హాయం తీసుకుంటున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇందులో నాగ‌చైత‌న్య ట్రెజ‌ర్ హంట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఆ లుక్ ఎలా ఉండాల‌న్న దానిపై మ‌నుషులే వ‌ర్క్ చేస్తారు, కానీ మ‌రింత ప‌ర్‌ఫెక్ష‌న్ ఉండాల‌ని ఏఐ స‌హాయం కూడా తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఏఐ స‌హాయంతో మ‌న స్టార్ హీరోల‌ని వెరైటీగా తీర్చిదిద్దారు. అల్లు అర్జున్‌ని జొమాటో బాయ్‌గా, రామ్ చ‌ర‌ణ్‌ని జ్యూస్ అమ్మే వ్య‌క్తిగా, ప్ర‌భాస్‌ని చికెన్ సీకులు అమ్మే వ్య‌క్తిగా, నానిని చాయ్ వాలాగా, మ‌హేష్ బాబుని ఆటో డ్రైవ‌ర్‌గా, ఎన్టీఆర్‌ని మ‌టన్ అమ్మే వ్య‌క్తిగా చూపించారు. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వీడియో అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఏఐతో ఇంత మాయాజాలం చేయ‌వ‌చ్చా అని అంద‌రూ ముక్కున వేలేసుకున్నారు.

editor

Related Articles