సినీ హీరో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏప్రిల్ 26న తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగింది. రెట్రో ప్రీ రిలీజ్ వేడుకల్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘కశ్మీర్ మనదే.. కశ్మీర్ ప్రజలు మనవాళ్లే.. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ యుద్ధం చేసిన రీతిలో పాకిస్తాన్ భారత్‌పై యుద్ధం చేస్తోంది. భారత్ పాకిస్తాన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. తిండి, నీళ్లు లేక అక్కడి ప్రజలే పాకిస్తాన్‌పై యుద్ధం చేస్తారని వ్యాఖ్యానించారు. దీంతో తమను కించపరిచేలా విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేస్తున్నారని జేఏసీ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ స్టేట్ ప్రెసిడెంట్ నెనావత్ అశోక్ కుమార్ నాయక్ ఈ నెల 17న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కోర్టు అనుమతితో శనివారం విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు.
- June 23, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor

