అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన ఈ యోగాంధ్ర వేడుక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొని చరిత్ర సృష్టించారు. దీంతో గతంలో సూరత్‌లో నిర్వహించిన యోగా రికార్డును యోగాంధ్ర అధిగమించింది. విశాఖలోని రామకృష్ణ బీచ్ నుండి భీమిలి వరకు లక్షలాది మంది ప్రజలు ఒకే మార్గంలో యోగాసనాలు వేసి ఈ అద్భుతమైన రికార్డును నమోదు చేశారు. 2023 గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన యోగా కార్యక్రమంలో 1,53,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఇదే అత్యధిక శాతం మంది పాల్గొన్న యోగా సెషన్‌గా రికార్డులో ఉండగా.. తాజాగా ఈ రికార్డును యోగాంధ్ర అధిగమించింది.
- June 21, 2025
0
52
Less than a minute
Tags:
You can share this post!
editor

