సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు తమిళ హీరో సూర్య. అందుకోసం కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు సూర్య. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది. దీనికంటే ముందుగా ఆయన ‘కరుప్పు’ అనే సినిమా చేస్తున్నారు. ప్యాచ్వర్క్ మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకు తమిళ కమెడియన్ ఆర్జే బాలాజీ దర్శకుడు. ఆర్జే బాలాజీ పుట్టినరోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ టైటిల్ పోస్టర్ని మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. అమ్మవారి నేపథ్యంలో కత్తి పట్టి ఫెరోషియస్ లుక్లో ఉన్న సూర్యను ఈ పోస్టర్లో చూడొచ్చు. సూర్య 45వ సినిమాగా రూపొందుతోంది. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: సాయి అభ్యంకర్, నిర్మాతలు: ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు.
- June 21, 2025
0
60
Less than a minute
Tags:
You can share this post!
editor

