తాజాగా ముగ్గురు హీరోయిన్లు పాత ఛరిష్మాతో అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. ఎలాంటి పాత్ర వచ్చినా నో చెప్పకుండా నటిస్తున్నారు. మరి ఆ హీరోయిన్లు మరెవరో కాదు కాజోల్, టబు, రాణీ ముఖర్జీ, విద్యా బాలన్, కరీనాకపూర్ తదితరులు. మేటి నాయకులతో పోటీపడి మరీ అవకాశాలని అందిపుచ్చుకుంటున్న ఈ హీరోయిన్లు నిజంగా గ్రేట్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టబు వయస్సు 50 ఏళ్లు దాటినా కూడా బోల్డ్ అండ్ రొమాంటిక్ పాత్రల విషయంలోనూ ఏమాత్రం రాజీ పడకుండా నటిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన `హౌస్ ఫుల్ 5`తో అదరగొట్టింది. అందులో ఈ నటి పాత్రకి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు `బూత్ బంగ్లా`లో నటిస్తోంది. అలాగే విద్యాబాలన్ విషయానికి వస్తే `భూల్ భులయ్య 3` తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ కమిట్ అయిన కొన్ని సినిమాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి. వాటితో త్వరలో పలకరించనుంది. ఇక కాజోల్ కూడా దూకుడు చూపిస్తోంది. లస్ట్ స్టోరీస్ -2 , దో పత్తి లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది. ఇటీవల రిలీజ్ అయిన హౌస్‌ఫుల్ 5 లోనూ నటించింది ఈ అందాల హీరోయిన్. ప్రస్తుతం క్వీన్ ఆఫ్ క్వీన్స్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. అలాగే సర్జమీన్ అనే సినిమాకు కమిట్ అయింది. ఈ సినిమాలతో రానున్న రోజులలో తెగ సందడి చేయనుంది. ఇక రాణీముఖర్జీ విషయానికి వస్తే గత రెండేళ్లుగా ఖాళీగా ఉన్నా ఆ గ్యాప్‌ను ఒకే ఏడాదిలో భర్తీ చేసేలా దూసుకుపోతోంది.. ప్రస్తుతం కింగ్, మర్దానీ 3 సినిమాలలో నటిస్తోంది. మర్దానీ హిట్ ప్రాంచైజీ నుండి రిలీజ్ అవుతున్న థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ సినిమాపై అంచనాలు అయితే ఓ రేంజ్‌లో ఉన్నాయి.
- June 21, 2025
0
51
Less than a minute
Tags:
You can share this post!
editor

