పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పటివరకు దాదాపు 13 సార్లు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా మేకర్స్ పోస్టర్ విడుదల చేస్తూ హరిహర వీరమల్లు చిత్ర రిలీజ్ డేట్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు. జూన్ 12న రావల్సి ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడం వలన వాయిదా పడింది. మరి జూలై 24న తప్పక తీసుకొస్తామని చెబుతుండగా, అదే సమయంలో విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ రిలీజ్ కాబోతుందట. కింగ్‌డమ్ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడింది. జులై 4న విడుదల చేయాలని ప్రకటించారు. కానీ ఆ డేట్‌కి రావడం లేదని, జులై 25న సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నారట. మరి ఇదే జరిగితే రెండు సినిమాల మధ్య గట్టిపోటీ ఉంటుంది. లేదంటే కింగ్‌డమ్ సినిమాని ఏమైన వాయిదా వేస్తారా అన్నది చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘హరిహర వీరమల్లు’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని క్రిష్ జాగర్లమూడి 50 శాతం చేసి వదిలివేశారు, తర్వాత భాగం జ్యోతి కృష్ణ కంప్లీట్ చేశారు. పీరియాడిక్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు.
- June 21, 2025
0
152
Less than a minute
Tags:
You can share this post!
editor

