అభిజ్ఞా పూతలూరు, చరణ్ లక్కరాజు నటించిన వెబ్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ సీరిస్‌కి కృష్ణ పోలూరు దర్శకుడు. శ్రీరామ్ నిర్మాత. ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ నెల 27న నుండి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను హీరో నవీన్‌చంద్ర విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. తాను డైరెక్ట్ చేసిన వెబ్‌సిరీస్ ‘రెక్కీ’ మాదిరిగానే ఈ ‘విరాటపాలెం’ కూడా మంచి విజయం సాధిస్తుందని, కథ ఈ సినిమాకి ప్రధానబలమని దర్శకుడు కృష్ణ పోలూరు అన్నారు. ఇంకా నిర్మాత శ్రీరామ్, హీరోయిన్ అభిజ్ఞ, చరణ్ లక్కరాజు, డీఓపీ మహేష్ కె.స్వరూప్, కథారచయిత దివ్య కూడా మాట్లాడారు.
- June 20, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor

