వ్యంగ్యంతో కూడిన హృద్యమైన కథ ‘ఉప్పుకప్పురంబు’. ఇందులో అపూర్వగా కనిపిస్తా. దృఢనిశ్చయం కలిగిన ఆదర్శవాది అపూర్వ. అయితే.. విషయ పరిజ్ఞానం మాత్రం తక్కువ. భిన్నమైన పాత్ర అన్నమాట. గ్రామీణ సంస్కృతుల నేపథ్యంలో ఈ పాత్ర సాగుతుంది. ఓ గంభీరమైన సమస్యను ప్రజల దృష్టికి తీసుకురావడానికి నా పాత్ర చేసే ప్రయత్నం ఆసక్తికరంగా, మనసుల్ని హత్తుకునేలా ఉంటుందని కీర్తి సురేష్ చెప్పారు. ఆమె, సుహాస్ ముఖ్య పాత్రధారులుగా నటించిన వ్యంగ్య హాస్యభరిత సినిమా ‘ఉప్పుకప్పరంబు’. ఐ.వి.శశి దర్శకుడు. రాధిక లావూ నిర్మాత. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా జూలై 4 నుండి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కీర్తి సురేష్ మాట్లాడారు. ఇందులో తాను చిన్నాగా నటిస్తున్నానని, తాను ఇప్పటివరకూ చేసిన పాత్రలకు భిన్నమైన పాత్ర ఇదని హీరో సుహాస్ తెలిపారు.
- June 20, 2025
0
103
Less than a minute
Tags:
You can share this post!
editor


