Movie Muzz

మెగా ఫోన్‌ పట్టనున్న హీరోయిన్  కాజల్‌ అగర్వాల్‌?

మెగా ఫోన్‌ పట్టనున్న హీరోయిన్  కాజల్‌ అగర్వాల్‌?

హీరోయిన్  కాజల్‌ అగర్వాల్‌ మెగా ఫోన్‌ పట్టనున్నారు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే తన చిరకాల మిత్రుడు గౌతమ్‌ కిచ్లుని పెళ్లాడేసి, వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్  కాజల్‌ అగర్వాల్‌.. ‘భగవంత్‌ కేసరి’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలపెట్టారు. ఆ సినిమా ఘన విజయం సాధించినా ఆ క్రెడిట్‌ అంతా బాలకృష్ణ, అనిల్‌ రావిపూడిల ఖాతాలో పడిపోవడంతో కాజల్‌కి మాత్రం ఆ స్థాయి అవకాశం దక్కలేదు. ఈ నెలలోనే ఆమె పార్వతీదేవి పాత్రలో నటించిన ‘కన్నప్ప’ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే రెండు దశాబ్దాల తన అనుభవాన్నంతా క్రోడీకరించి, ఓ సినిమాని స్వీయ దర్శకత్వంలో నిర్మించేందుకు కాజల్‌ సిద్ధమయ్యారని బీటౌన్‌ టాక్‌. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావల్సి ఉంది.

editor

Related Articles